మాజీ ప్రేయసి ని పబ్లిక్ గా సల్మాన్ ఏమన్నాడో తెలుసా ?

సల్మాన్ ఖాన్ కి పెళ్లి అయితే అవలేదు కానీ గర్ల్ ఫ్రెండ్ ల విషయం లో మాత్రం మనోడికి మొదటి నుంచీ తిరుగే లేదు. వేళ్ళ మీద లెక్క పెడితే సరిపోని అంతమంది అమ్మాయిలతో సల్లూ భాయ్ లైఫ్ ఎంజాయ్ చేసాడు. వారందరిలో కీ కత్రినా కైఫ్ కాస్త స్పెషల్ సల్మాన్ కి. సల్మాన్ చాలా ఇబ్బందికర పరిస్థితి లో లైఫ్ లీడ్ చేస్తున్న టైం లో కూడా కత్రినా నే అతని వెనకాల నిలబడింది. జైలు జీవితం లో సల్లూ ఇరుక్కున్నప్పుడు కూడా ఆమె అతనితోనే ఉంది.

ఒక దశ లో వీరిద్దరినీ చూసి సల్మాన్ – కత్రినా ఒకటి అవ్వబోతున్నారు అనే వార్తలు కూడా వినపడ్డాయి కానీ తరవాత వారు విడిపోయారు. తాజాగా ఒక అవార్డుల వేడుక లో మాట్లాడుతూ కత్రినా తో కలిసి డాన్స్ చేసిన సల్మాన్ ఆమె మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు . “ఇండస్ట్రీ లో ఉన్న బెస్ట్ డాన్సర్ లలో ఆమె ముఖ్యమైన డాన్సర్ .. ఆమె డాన్స్ విషయం లో ఎవరూ కంగారు పడక్కర్లేదు ” అంటూ పోగిడేసాడు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here