ప్ర‌పంచాన్ని గెలిచిన చైనా డాక్ట‌ర్ లుయో హెంగ్

చైనాకు చెందిన లుయో హెంగ్ అనే డాక్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. డాక్ట‌ర్  ఫోటోల్ని నెటిజ‌న్లు షేర్ చేస్తూ ఈయ‌నే నిజ‌మైన హీరో అని  నిరాజ‌నాలు ప‌లుకుతున్నారు.
దేవుడికి కోపం వ‌స్తే డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి పంపిస్తాడు. డాక్ట‌ర్ కి కోపం వ‌స్తే దేవుడిద‌గ్గ‌రికి పంపిస్తాడ‌నే సామెత ఉందిగా. అందుకే డాక్ట‌ర్ ను దేవుడితో కొలుస్తారు. ఇంత‌కీ అస‌లు విష‌యానికొస్తే లుయో హెంగ్ అనే డాక్ట‌ర్  చైనాలో ఓ ఆస్ప‌త్రిలో వైద్య‌సేవ‌లు అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌ల్ని పొందుతున్నాడు.

అయితే మార్చి 30న లుయో  పేషంట్ల‌కి శ‌స్త్ర చికిత్స చేయాల్సి ఉంది. మొద‌ట రెండు ఆప‌రేష‌న్లు చేశాడు. మ‌రో మూడు ఆప‌రేష‌న్లుకు చేయాల్సి ఉండగా కొంచెం స‌మ‌యం ఉంది. ఆ స‌మ‌యాన్ని వృదా చేయ‌కుండా రోగుల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించాడు. అంత‌టితో ఆగ‌లేదు. తాను చేయాల్సి మూడు ఆప‌రేష‌న్ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అంతే ఆలస్యం చేయకుండా ఆ మూడు ఆప‌రేష‌న్ల‌ని 28గంట‌ల పాటు చేసి విజ‌య‌వంతంగా ముగించాడు. అంతేకాదు ఎక్క‌డ తాను ఇంటికి వెళ్లివ‌స్తే రోగులు ఇబ్బందులు ప‌డ‌తారేమోన‌ని ఇంటికి వెళ్ల‌కుండా ఆస్ప‌త్రిలో ఇలా నేల‌పై ప‌డుకొని నిద్ర‌పోయాడు.

డాక్ట‌ర్ అంకిత భావంపై మ‌క్కువ చూపిన చైనా గ్లోబ‌ల్ టీవీ నెట్ వ‌ర్క్ డాక్ట‌ర్ ఆస్ప‌త్రిలో నేల‌పై ప‌డుకొని నిద్రిస్తున్న ఫోటోల్ని త‌న ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలే ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ప్ర‌పంచ వ్యాప్తంగా డాక్ట‌ర్ల‌కు అస‌లైన నిర్వ‌చ‌న లుయో హెంగ్ అని పొగిడేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here