ఈ అమ్మ‌డుతో డేటింగ్ చేస్తున్న ప్ర‌ముఖ ఇండియ‌న్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా

అనుస్మృతీ స‌ర్కార్ ..బెంగాల్ సినిమాల్లో హీరోయిన్ గా వెలిగిపోతున్న ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అనుస్మృతీ స‌ర్కార్ ఇండియ‌న్ క్రికెట‌ర్ తో డేటింగ్ లో ఉన్న‌ట్లు, ఇప్పుడు ఆ ఆట‌గాడు ఐపీఎల్ బిజీగా ఉంటూ ఈ అమ్మ‌డుతో చెట్టాప‌ట్ట‌ లేసుకొని తిరుగుతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు ఊత‌మిస్తూ క్రికెట‌ర్,  అనుస్మృతి కారులో షికారు చేస్తున్న ఫోటోలో వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కీ ఆ ల‌క్కీ క్రికెట‌ర్ ఎవ‌రా అని ఆరాతీయ‌గా త‌నే ఇండియ‌న్ బౌల‌ర్  భువ‌నేశ్వ‌ర్ కుమార్ అని తెలుస్తోంది.

భువ‌నేష్ , స‌ర్కార్ తిరిగిన ఫోటోలు, డిన్న‌ర్ చేసిన ప్ర‌దేశాల్ని సోష‌ల్ మీడిలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోల్లో అనుస్మృతి ఫోటోల్ని తీయ‌కుండా భువ‌నేష్ ఫోటోల్ని మాత్రమే తీసి నెటిజ‌న్ల‌కు ఆస‌క్తిని పెంచేలా చేశాడు. అంతే కాదండోయ్ పోస్ట్ చేసిన ఫోటోల‌కు డిన్న‌ర్ డేట్ అని క్యాప్ష‌న్ త‌గిలించ‌డంతో డేటింగ్ లో ఉన్న‌ట్లు అర్ధ‌మ‌వుతుంద‌ని అభిమానులు చెప్పుకుంటున్నారు.  భూవీతో డేటింగ్ లో ఉన్న ఈ అమ్మ‌డు ఎవ‌ర‌నేదానిపై ఆమె అనుస్మృతి స‌ర్కార్ అని బెంగాలీ జ‌నాలు గుస‌గుస‌లాడుతున్నారు. అనుస్మృతీనా లేక మ‌రెవ‌రైనా అనేదానిపై క్రికెట‌ర్ క్లారిటీ ఇవ్వాల‌ని ఔత్సాహికులు న‌రాలు తెంచుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here