ఏపీ లో నిరుద్యోగులకి శుభవార్త – నెలకి ఐదు వేలు మీ ఎకౌంటు లో

ఎన్నికల ముందర నిరుద్యోగులకి రెండు వేల నిరుద్యొగ భ్రుతి ఇస్తాం అని హామీ ఇస్తాం అని చెప్పిన చంద్రబాబు సర్కారు ఆ హామీ నిలుపుకునే పనిలో పడింది. రెండు వేలు తో పాటు మరొక మూడు వెలి కూడా కలిపి ఇస్తారట.  నిరుద్యోగులకు వివిధ సంస్థల్లో శిక్షణ ఇప్పించి ఆపై వారికి అదే సంస్థలో ఉద్యోగాలు ఇప్పించాలని, శిక్షణా సమయంలో రూ. 2 వేల నిరుద్యోగ భృతితో పాటు, స్టయిఫండ్ గా రూ. 3 వేలు ఇస్తారు. ఆర్ధిక మంత్రి యనమల నేతృత్వం లో మంత్రులు నారా లోకేష్ , కొల్లు రవీంద్ర లు ఈ విషయం మీద చర్చలు జరిపారు.
పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వం తో ఈ విషయమై ఒప్పందాలు కుదుర్చుకోవాలి అని చూస్తున్నాయి. ఇక ఎంతమంది నిరుద్యోగులకు ఈ విధంగా చేయగలమన్న అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించామని, పథకం అమలుపై వచ్చే నెల 5వ తేదీన పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీలతో సమావేశం కానున్నామని మంత్రులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here