బాహుబలి ని మేము కేర్ చెయ్యం – కెసిఆర్ కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు

రాబోతున్న ఎన్నికల్లో తెరాస పార్టీ పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది అనీ తన తండ్రి కెసిఆర్ తిరుగులేని ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పాలనే ఆయన్ని మళ్ళీ కుర్చీ లో కూర్చో బడుతుంది అని కెసిఆర్ కూతురు , తెరాస ఎంపీ కవిత అన్నారు. టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ” డిల్లీ నుంచి బాద్షా వచ్చినా , కాంగ్రెస్ పార్టీ నుంచి బాహుబలి వచ్చినా తెరాస విజయాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అసలు బాహుబలి నీ బాద్షా లనీ మేము కేర్ కూడా చెయ్యము . ఎందుకంటే మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం.
ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తూ ప్రజల కి లోటు లేకుండా పాలిస్తున్నాం ” అన్నారు ఆమె. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటిని సరఫరా చేసి… ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here