శరీరం బయట గుండెతో పుట్టింది ..

శరీరం లో గుండె అనేది చాలా ముఖ్యమైన పార్ట్ . గుండె చేసే రక్త సరఫరా నే అన్ని ప్రాంతాలకీ చేరి శరీరం దృడంగా ఉంటుంది. గుండె జబ్బుల విషయం లో ఇప్పటికే ఎందరో అనారోగ్యం పాలు అవుతున్న టైం లో గుండె కోసం జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ అవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ శిశువు శరీరం వెలుపల గుండెతో పుట్టింది. ఆ పాప తల్లి తండ్రుల దగ్గర తగినంత సొమ్ము లేకపోవడం తో ఆ పాప కి కలక్టర్ చొరవ అవసరం అయ్యింది. ఆ పాప తండ్రి అరవింద్ పటేల్ ఖజురహో ఆలయానికి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు.

తన భార్య‌కి పురిటి నొప్పులు రావ‌డంతో ఈ నెల 5న‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే, అత్యంత అరుదైన సమస్యగా భావించే ఎక్టోపియా కార్డిస్ (శరీరం వెలుపల గుండె) తో త‌నకు పాప పుట్టిందని తెలుసుకొని బాధ‌ప‌డ్డాడు. ఆ పాప‌ను తక్షణమే ఛత్తార్పూర్ జిల్లా ఎస్ఎన్సీయూ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించడంతో ఆ శిశును అక్కడికి తీసుకెళ్లాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here