క్లైమాక్స్ కోసం పవన్ రెండు రోజులు భోజనం చెయ్యలేదు

పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో సుస్వాగతం చాలా స్పెషల్ సినిమా అని చెప్పాలి. అతిపెద్ద హిట్ గా గోకులం లో సీత లాంటి యావరేజ్ తరవాత కనపడిన సుస్వాగతం చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. డైరెక్టర్ భీమనేని ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ విశేషాలు చెప్పారు. క్లైమాక్స్ కోసం పవన్ ఎంతగా ప్రిపేరైంది.. ఆ సీన్ తీసేటపుడు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడాడు భీమనేని. ” శుభమస్తు , శుభాకాంక్షలు లాంటి హిట్ ల తరవాత సూర్య వంశం చేస్తున్న టైం లో సుస్వాగతం సబ్జెక్ట్ వచ్చింది. దానికి కళ్యాణ్ ని తీసుకుందాం అనుకున్నా. వెంకటేష్ లాంటి స్టార్ తో చేస్తూ మధ్యలో అప్ కమింగ్ హీరో ఎందుకు అన్నారు.

కానీ నేను వినలేదు. అప్పటికి నేను కళ్యాణ్ తొలి సినిమా చూడలేదు. చెన్నైలోని ఒక ప్రివ్యూ థియేటర్లో ‘అక్కడ అమ్మా ఇక్కడ అబ్బాయి’ ప్రింట్ తెప్పించుకుని రెండు రీళ్లు చూడగానే ఇతనే నా హీరో అనుకున్నాను. క్లైమాక్స్ సీన్ కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజులు భోజనం చెయ్యలేదు. సినిమా కోసం ఇంతగా పనిచేసిన హీరో ని నేను చూడలేదు. ” అని చెప్పుకొచ్చారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here