టీడీపీ వైపు.. కిరణ్ కుమార్ రెడ్డి చూపు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డ చూపు.. టీడీపీపై పడుతున్నట్టు సిగ్నల్స్ అందుతున్నాయి. ముందు.. కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా.. ఈయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని సైకిల్ ఎక్కించేందుకు అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా.. కిరణ్ కుమార్ తల్లి చనిపోయినపుడు.. టీడీపీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారట. అప్పుడే.. కిషోర్ కుమార్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయట.

వాస్తవానికి.. చాలా కాలంగా.. బీజేపీ అన్నారు.. వైసీపీ అన్నారు.. చివరగా టీడీపీ అని కూడా అన్నారు. ఇలా.. నల్లారి వారి కుటుంబం ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ.. చివరాఖరికి ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీవైపే.. నల్లారి కుటుంబం అడుగులు పడుతుండడం గమనించాల్సిన విషయం.

ఈ విషయం తెలుసుకున్న కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు.. పార్టీలో ఇంటర్నల్ గా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి సొంత నిర్ణయాలు అమలు చేశాడో గమనించాలని అధినేతకు సూచిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అందుకే.. ఆయన్ను పార్టీలో ఆహ్వానించినా.. కిరణ్ కుమార్ రెడ్డిని మొదటి నుంచే కంట్రోల్ చేయాలన్న సూచన చంద్రబాబుకు అందినట్టు టాక్.

ఇది తెలుసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా.. తన తమ్ముడిని ముందుగా తెలుగుదేశంలోకి పంపి.. తర్వాత.. తనకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడ్డ తర్వాతే.. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికలు వచ్చే 2019 నాటికి టీడీపీ వేదికపై నుంచి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆలోచనలో ఉన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here