ఇండియాలో ధనిక సీఎం చంద్రబాబే..

దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక సీఎం ఎవరో తెలుసా… విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద రాష్ర్టం నవ్యాంధ్ర సీఎం చంద్రబాబు. రీసెంటుగా తేలిన లెక్కల ప్రకారం రూ.177 కోట్ల ఆస్తులతో చంద్రబాబు దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోనూ అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు.
చంద్రబాబు తరువాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఉన్నారు. ఆయన ఆస్తి 129 కోట్లు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు 15 కోట్లు.
వీరే టాప్ 5 ధనిక సీఎంలు
1. చంద్రబాబు.. 177 కోట్లు
2. పెమా ఖండూ… 129 కోట్లు
3. అమరీందర్ సింగ్… 48 కోట్లు
4. వీరభద్రసింగ్… 34 కోట్లు
5. కేసీఆర్… 15 కోట్లు.
పేద సీఎంలు..
1. మాణిక్ సర్కార్… 26 లక్షలు
2. మెహబూబా ముఫ్తీ… 55 లక్షలు
3. మనోహర్ లాల్ ఖట్టర్.. 61 లక్షలు
4. రఘువర్ దాస్… 72 లక్షలు
5. యోగి ఆదిత్యనాథ్.. 77 లక్షలు
కాగా అత్యంత ధనిక సీఎం చంద్రబాబుకు.. మరో తెలుగు రాష్ర్టం సీఎం, అయిదో స్థానంలో ఉన్న కేసీఆర్ కు ఆస్తుల మధ్య వ్యత్యాసం 162 కోట్లు ఉండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here