చెన్నైకు బైబై.. హైదరాబాద్ కు హాయ్ హాయ్

టైటిల్ చూసి ఇదేదో సినిమా టైటిల్ అనుకుంటున్నారా… ఎంత మాత్రం కాదు. తెలుగులో హీరోయిన్ గా సక్సెస్ అవుతున్న కీర్తి సురేష్ తీసుకున్న రీసెంట్ నిర్ణయానికి సంబంధించిందే ఈ స్టోరీ. ప్రస్తుతం సూర్యతో నటిస్తున్న సినిమా తప్ప.. కీర్తి సురేష్ కు తమిళ్ లో మరే సినిమా లేకపోవడంతో.. ఆమె సీరియస్ గా ఓ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగులో తనకు పెరుగుతున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కీర్తి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు మంచి డిమాండ్ ఉంది. నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో ఫాలోయింగ్ సంపాదించుకున్న కీర్తి.. త్వరలోనే పవన్ కల్యాణ్ తో ఓ సినిమా, సావిత్రి రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కనున్న మరో సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్స్ చేయనుంది. దీంతో.. చెన్నైకి కొన్నాళ్లు టాటా చెప్పేసి.. హైదరాబాద్ లోనే ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుందట.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత.. కీర్తి సురేష్ కు కాస్త త్వరగానే అర్థమైనట్టుంది కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here