అనిరుధ్ పెళ్లి చేసుకునేది.. ఎవర్నో తెలుసా?

వై దిస్ కొలవెరి డీ సాంగ్ తో.. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. టాలెంట్ కు తగిన వ్యవహారాలు కూడా తోడవడంతో.. రీసెంట్ గా వివాదాల్లో కూడా ఇరుక్కుంటున్నాడు. దీంతో.. ఓ ఇంటివాడిని చేస్తే తప్ప.. అనిరుధ్ దారికి రాడని అతని ఫ్యామిలీ ఫిక్సయిపోయినట్టుంది. అందుకే.. ఓ అమ్మాయిని అతనికి జోడీగా ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

అనిరుధ్ కాబోయే అమ్మాయి ఓ నగల వ్యాపారి కూతురు మాత్రమే కాదనీ.. అనిరుధ్ కు వీరాభిమాని అనీ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ తో ఫుల్ జోష్ మీదున్న అనిరుధ్.. ఇప్పుడు పెళ్లి కన్ఫమ్ అయిందన్న న్యూస్ తో సిగ్గుల మొగ్గ అయిపోతున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here