పాపం తాప్సీ.. తనను వాడుకున్నారని ఫీలైపోతోంది

తమిళ సినీ ప్రేక్షకులపై హాట్ బ్యూటీ తాప్సీ.. తెగ ఫీలైపోతోంది. తమిళ్ తో పాటు.. తెలుగులో కూడా తాప్సీకి అనుకున్న విజయాలు రాలేదు. దీంతో.. బాలీవుడ్ చెక్కేసి.. అక్కడ గ్లామర్ డాల్ గా సక్సస్ అవుతోంది. రీసెంట్ గా.. హిందీలో నామ్ షబానా పేరుతో.. తాప్సీ ఓ మూవీ చేసింది. ఇది.. తమిళ్ లోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన చిన్నది తాప్సీ.. తనకు తమిళ సినీ పరిశ్రమ అంటే ఎంత ఇష్టమో మనసు విప్పి మరీ చెప్పింది.

తమిళంలో తాను 5 సినిమాల్లో నటిస్తే.. 4 సూపర్ హిట్ అయ్యాయని.. అయినా తనను ఎందుకో తమ పక్కింటి అమ్మాయిగా జనాలు అంగీకరించలేదని నిరాశను వ్యక్తం చేసింది. తనను గ్లామర్ రోల్స్ కే వాడుకున్నారని కామెంట్ చేసింది. మంచి అవకాశం వస్తే.. ఇప్పటికీ తమిళ సినిమాల్లో నటించేందుకు సిద్ధమే అని.. తన ఇంటెన్షన్ ను క్లియర్ చేసింది. ఇంత ఓపెన్ గా తన మనసు విప్పేసిన తాప్సీకి.. ఎవరు అవకాశం ఇస్తారో చూడాల్సిందే.

అయితే.. తమిళ్ లో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే.. భారీ అందాలు.. మాంచి కండ పట్టిన శరీరం.. ఎత్తులు, ఒంపులు.. అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాల్సిందే. ఈ విషయంలో తాప్సీ కాస్త పూర్ కాబట్టి.. ఆమె కోరిక ఎంత వరకూ నెరవేరుతుందో మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here