పండగ వేళ.. మామిడి ఆకులు ఎందుకు కడతారో తెలుసా?

ఇవాళ ఉగాది. చాలా మంది మీ ఇళ్లలో మామిడి ఆకుల తోరణాలను గుమ్మాలకు కట్టే ఉంటారు. కానీ.. అలా పండగల వేళ ఎందుకు అలా చేస్తారో తెలుసా.. చాలా మందికి తెలిసుండదు. ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి మరి.

ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కడితే.. వాస్తు దోషాలు పోతాయన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. అలాగే.. మామిడి ఆకుల ప్రభావంతో.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుందట. ఇక.. మామిడి ఆకులు లక్ష్మీదేవి స్వరూపానికి ప్రతిరూపాలన్న విశ్వాసం కూడా.. పండగలు, వేడుకల సమయాల్లో.. వాటిని ఇంటి ముందు కట్టడం తోపాటు.. గుమ్మాలకు కట్టడానికీ ఓ కారణంగా పెద్దలు చెబుతారు.

ఇంట్లో ఉండే గాలి కూడా మామిడి ఆకుల ప్రభావంతో పరిశుభ్రమై.. మంచి ఆరోగ్యం ఇంట్లో ఉన్నవాళ్ల సొంతమవుతుందట. దుష్టశక్తులు పోయి.. అనుకోని ధనం వచ్చి చేరుతుందన్న నమ్మకం కూడా ఉంది. పైగా.. మామిడి ఆకులు ప్రశాంతతకు చిహ్నాలనీ.. వాటి తోరణాలు చూడగానే మనసులో ఓ రకమైన విశ్వాసం.. పాజిటివ్ ఎనర్జీ మొదలవుతాయని కొందరు చెబుతుంటారు.

ఇలా.. సైంటిఫికల్ గా.. ఆధ్యాత్మికంగా మామిడి ఆకులు మంచి ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టే.. ప్రతి పండగ వేళ.. వాటిని ఇళ్ల ముందు, ఇళ్లలో గుమ్మాలకు కడుతుంటారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here