ఇల్లు అద్దెకి ఇచ్చి .. బూతు వీడియో రికార్డ్ చేసి , నెట్ లో పెట్టాడు

భార్యాభర్తలు బెడ్‌ రూంలో ఏకాంతంగా ఉన్నప్పటి దృశ్యాలు ఒక శృంగార వెబ్ సైట్ లో దర్శనమివ్వడంతో దంపతులు విస్తుబోయి పోలీసులను ఆశ్రయించిన వైనం బెంగళూరులో వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వెళ్తే… బెంగళూరులోని కోరమంగళ లోని ఒక అద్దె ఇంట్లో దంపతులు నివసిస్తున్నారు. తాజాగా వారి బంధువులు వారికి ఫోన్ చేసి, వారిద్దరూ ఏకాంతంగా గడిపిన శృంగార దృశ్యాలు వెబ్‌ సైట్‌ లో చూశామని చెప్పారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆ దంపతులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ దౌర్భాగ్యానికి ఒడిగట్టింది ఇంటి ఓనర్ కుమారుడు అంజన్ అని నిర్ధారించారు. వారిద్దరూ ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి ప్రవేశించిన అంజన్ వారి బెడ్ రూంలో సీసీ కెమెరా పెట్టి, వారిద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించాడు. అనంతరం వాటిని ఒక శృంగార వెబ్ సైట్ లో అప్‌ లోడ్‌ చేశాడని తేల్చారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అతను పరారయ్యాడు. దీంతో ప్రత్యేక టీమ్ తో అతని కోసం గాలింపు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here