నీ తమ్ముడి ముందే నిన్ను రేప్ చేస్తా .. ఫేస్ బుక్ లో పెద్ద వార్నింగ్ ఇచ్చాడు .. అతని పరిస్థితి ఏమైంది

అభిప్రాయాలు పంచుకుని స్నేహపూరిత వాతావరణం పెపొందించుకునేందుకు రూపొందించిన సోషల్ మీడియా ఏ స్థాయిలో దుర్వినియోగమవుతుందో తెలిపే ఘటన కోల్ కతా వేదికగా చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే…అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న యువతి (20) తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది.

దానిని తన తమ్ముడిని ట్యాగ్ చేసింది. దీంతో ఆ పోస్టు ఆమె తమ్ముడి ఖాతాలోని స్నేహితులకు కూడా వెళ్లింది. దీంతో కోల్ కతాకు చెందిన అగ్నీశ్వర్ చక్రవర్తి దానికి కామెంట్ పెట్టాడు. అపరిచితుడు పెట్టిన కామెంట్ అంటూ ఆమె దానిని తొలగించింది. దీంతో అగ్నీశ్వర్ చక్రవర్తి ఆగ్రహానికి గురయ్యాడు.

దీంతో మరోసారి వారి అకౌంట్ లో కామెంట్ చేసిన అగ్నీశ్వర్… ఆమెకు… నా కాళ్లమీద పడి ప్రాధేయపడుతున్నా…క్షమించు అని వేడుకుంటున్నా… నీ తమ్ముడి కళ్లముందే నిన్ను రేప్ చేసి చంపేస్తాను. అంటూ బండబూతులతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీనిపై కోల్ కతాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ అగ్నీశ్వర్ పై పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పోస్టును చూసిన పోలీసులు, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని, అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here