వైరల్ వీడియో – హీరో రాజశేఖర్ మీద అర్ధరాత్రి జోకులు

గత ఆదివారం రాత్రి హీరో రాజశేఖర్ పీవీ ఎక్స్ ప్రెస్ వేపై వెళుతూ బిల్డర్ రామిరెడ్డి కారును ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బయటకు వచ్చిన వీడియో ఒకటి అన్ని చానళ్లలోనూ ప్రసారమైంది. కానీ, యాక్సిడెంట్ జరిగిన కొన్ని క్షణాల తరువాత తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఏ కారులో వచ్చానన్న విషయాన్ని కూడా చెప్పలేని స్థితిలో రాజశేఖర్ ఇందులో కనిపిస్తుండగా, పక్కనున్న వాహనదారులు ఆయనతో జోకులేసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఓ యువకుడు ఏకంగా, తాను ప్రొడ్యూసర్ రిలేటివ్ నని చెబుతూ, ఇలా యాక్సిడెంట్ చేస్తే ఎలాగని నిలదీశాడు. యాక్సిడెంట్ ఎలా అయిందని అడిగితే, ఎక్కడ యాక్సిడెంట్ అయిందని రాజశేఖర్ ప్రశ్నించాడు. ఏ బండితో గుద్దించావ్? అని ప్రశ్నిస్తే, ఏ బండి? అని ఎదురు ప్రశ్నించడంతో, ‘నువ్వు డ్రైవింగ్ ఏ కారులో చేశావో తెలియడం లేదు’ అని అందరూ నవ్వేశారు. మరో వ్యక్తి రాజశేఖర్ నడుంపై చెయ్యివేసి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తాను వెళ్లిపోవాలని రాజశేఖర్ అంటే, ‘పోదువుగాని… పోదువుగాని, నీ కారు నీ ఇంటికి క్షేమంగా చేరుతుంది’ అని అక్కడి వాళ్లు చెప్పడం వినిపిస్తోంది. https://www.youtube.com/watch?v=_lzsJubavnE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here