అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ..

అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా విజయవాడలో కొలువైంది. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. అమ్మకు   ప్రతిరోజు పూజలు చేస్తాం. ప్రత్యేకించి అమ్మను దేవి నవరాత్రుల పేరుతో ఒక్కోరోజు ఒక్కో శక్తిగా పూజిస్తారు. ఆ తొమ్మిది రోజుల్లో దుర్గమ్మకు ధరించే వస్త్రాధరణపై శద్రవహించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
నవరాత్రుల తొమ్మిది రోజుల్లో భక్తులు రంగులు ధరించాలి. దుర్గా మాత అవతారానికి ఎలాంటి వస్త్రాలు ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. భక్తులు సూచించిన రంగుల్ని ధరిస్తే అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని  పండితులు చెబుతున్నారు.
నవంబర్ లో అమ్మవారిని పూజించే నవరాత్రి ఉత్సవాల్ని ప్రతిరోజు పలు పేర్లతో పూజిస్తారు. అలా
1.  శైల పుత్రి మాత
2. బ్రహ్మచారిణీ మాత
3.  చంద్రఘంట అవతారం
4. కూష్మాండ అవతారాం
5. స్కంద మాత
6. కాళరాత్రి అవతారం
7. కాత్యాయనీ మాత
8. మహా గౌరీ మాత
9. సిద్ధిధాత్రి మాత అంటూ దుర్గమ్మను కొలుస్తారు.
ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎలాంటి రంగు వస్త్రాల్ని అలంకరించాలి. భక్తులు ఎలాంటి దుస్తువులు ధరించాలి అనేది తెలుసుకుందాం.
 1. మొదటి రోజు- నవరాత్రుల ప్రారంభ రోజున అమ్మకు బూడిద రంగు వస్త్రాలను అలంకరించాలి. భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించాలి.
2. రెండవరోజు- ఈరోజు అమ్మవారి అవతారిని నారింక రంగు దుస్తువులు అలకించాలి. భక్తులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి.
3. మూడవరోజు- ఈరోజు తెల్లని చీరతో అలంకరిస్తారు. భక్తులు బూడిద రంగు దుస్తులు ధరించాలి.
4. నాల్గవ రోజు- ఈరోజు అమ్మను ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి.
5. ఐదవరోజు- అమ్మవారిని నీలం రంగు చీరతో అలంకరిస్తారు.ఈరోజు భక్తులు తెలుపు రంగు దుస్తులు ధరించాలి.
6. ఆరవరోజు- మాతని పసుపు పచ్చ రంగు దుస్తులతో అలంకరించి మహా షష్టి ని జరుపుకుంటారు.భక్తులు ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
7. ఏడవ రోజు- ఈరోజు అమ్మవారిని ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరించాలి. భక్తులు ధరించాల్సిన రంగు నీలం.
8. ఎనిమిదవరోజు – ఈరోజు అమ్మవారిని నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులతో అలంకరిస్తారు. భక్తులు పింక్(గులాబీ రంగు) దుస్తులు ధరిస్తారు.
9. తొమ్మిదవ/పదవరోజు-నవమి/దశమి/ అమ్మవారి ఈ అవతారాన్ని భక్తులు ఊదారంగు దుస్తులతో అలంకరించి మహార్ నవమి పూజ చేస్తారు. భక్తులు కూడా ఊదా రంగు దుస్తులు ధరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here