ఇంటిలో ఎలాంటి విగ్రహాల్ని ప్రతిష్టించాలి

మన ఇంటి పూజగదిలో దేవుడికి పూజలు చేస్తాం. అందులో రకరకాల దేవుళ్ల విగ్రహాలతో ప్రతీష్టించి
 మనశ్శాంతిని, ధైర్యాన్ని,ప్రశాంతతను ఇవ్వాలని కోరుకుంటాం. కానీ దేవుని విగ్రహాలు ప్రతిష్టించే ముందు జాగ్రత్తలు వహించాలి. లేదంటే కష్టాలు కొనితెచ్చుకోవాల్సి ఉంది. వినాయకుడు, సరస్వతి దేవి విగ్రహాల్ని ప్రతిష్టించడం ఇంటికి చాలా మంచిది. ఇంట్లో ధనం నిలబడాలంటే కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి.
విగ్రహాలు పెద్దగా ఉండకూడదు. మీ కుల దైవం మరి ఇష్ట దైవం పెట్టుకోవాలి. అలాగే మరణించిన వాళ్ళ ఫోటోలను పూజ గదిలో పెట్టడం వల్ల దురదృష్టంతో పాటు, ప్రశాంతత కోల్పోవడం, శ్రేయస్సు, ధనం కోల్పోవడం కూడా జరిగే అవకాశాలున్నాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్యం దిశగా ఉండాలి. చనిపోయిన పెద్దవాళ్ల ఫోటోలు వాయువ్య దిశగా ఉండాలి. అలాగే  దేవుడిని నేల మీద కాకుండా కొంచెం ఎత్తులో మనం కూర్చుంటే, దేవుడి పాదాలు మన చాతీ దగ్గరకు రావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here