వ‌స్తువు ట్రై చేసి నచ్చితేనే కొనచ్చు ..లేదంటే పంపేయచ్చు

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం త‌న క‌ష్ట‌మ‌ర్ల‌కు ఆక‌ట్టుకునేందుకు స‌రికొత్త సేవ‌ల్ని అందుబాటులోకి తెచ్చింది. మ‌నం ఏదైనా ఆన్ లైన్ లో షాపింగ్ చేసిన వ‌స్తువు ఆర్డ‌ర్ గా ఇంటికి వ‌చ్చిన ఆ వ‌స్తువు స‌రిగా ఉండక పోవ‌డం..బ‌ట్ట‌ల‌కి బ‌దులు ఇటుక‌బిళ్ల‌లు , ఫోన్ బ‌దులు అట్ట‌ముక్క‌లు లాంటివి మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే తాజాగా క‌ష్ట‌మ‌ర్ల‌కు ఇలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేలా ఆమెజాన్ చ‌ర్య‌లు తీసుకుంటుంది. ట్రై బిఫో్ర్ యు బై అనే సేవ‌ల‌తో ముందుకొచ్చింది. ప్రైమ్ క‌ష్ట‌మ‌ర్లు ఎవ‌రైనా ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువులు  ఇంటికి వాటిని ట్రై చేయోచ్చు. న‌చ్చితే వినియోగించుకోవ‌చ్చు . లేదంటే న‌చ్చ‌లేద‌ని వెన‌క్కి పంపేయ‌వ‌చ్చు.

దీనిపై క‌ష్ట‌మ‌ర్లు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్డర్ వ‌స్తువు ఎలాంటిదో చెక్ చేసుకోవ‌డం, న‌చ్చ‌క‌పోతే పంపేయ‌డంలాంటి స‌ర్వీస్ చాలా బాగుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఈ ప్ర‌యంత్నం బాగుంటే త్వ‌ర‌లో ఫ్లిప్ కార్ట్ కూడా ఈ ఆఫ‌ర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధ‌మైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here