దువ్వాడ జగన్నాథం పాటలో : నమకం , చమకం బదులుగా నా గమకం , నీ సుముఖం

దువ్వాడ జగన్నాథం సినిమాలోని పాటలు వాటి లోని సాహిత్యం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకి ఈ అంశానికి నెమ్మదిగా తెర పడింది. అస్మైక యోగ , తస్మైక భోగ అంటూ సాగుతూ వెళ్ళే పాటలో నమకం చమకం పదాల దగ్గర బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి. ప్రభుత్వం వరకూ వెళ్లి సినిమా ఆపేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. పాటలోని పదాలని తొలగిస్తూ ఉనట్టు ప్రకటించిన సినిమా బృందం ఆడియో సీడీ లలో అవే పాటలు వదిలింది. దీంతో బ్రాహ్మణులు మళ్ళీ గొడవ చేసారు. విడుదల ముందర ఈ గొడవ ఎందుకు అనే ఉద్దేశ్యం తో దిల్ రాజు నెమ్మదిగా ఈ వివాదాన్ని ఆపేశారు.
ఈ పాటలో నమకం , చమకం బదులుగా నా గమకం , నీ సుముఖం అనే మాటలు పెట్టారు. సెన్సార్ బోర్డు కి పంపిన పదాలలో ఇవే ఉన్నాయి అని తెలుస్తోంది. కొత్త పదాలతో ప్రోమో సాంగ్ కూడా రావడం తో అందరూ సైలెంట్ అవుతారు అనే ఊహిద్దాం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here