అనిల్ కుంబ్లేను నోటికొచ్చిన‌ట్లు తిట్టిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ కోహ్లీకి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకు మ‌ధ్య వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. కోచ్ ప‌ద‌వి రేసులో అనిల్ కుంబ్లే పేరు ఉండ‌డంతో.. కోహ్లీ నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇద్ద‌రి మ‌ధ్య ఏమైందో తెలియ‌కున్నా..క్రికెట్ క్రిటిక్స్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం…అనిల్ కుంబ్లే క్రికెట‌ర్ల శాల‌రీలను  త‌గ్గించాల‌ని డిమాండ్ చేయ‌డం, జ‌ట్టుస‌భ్యులు ఎంపిక గురించి ముందే త‌న వ‌ర్గ‌మీడియాకు లీకులు చేయ‌డంపై కోహ్లీ గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఐసీసీ చాంపియ‌న్ ట్రోఫీ క‌ప్ పైన‌ల్ మ్యాచ్ లో పాక్ పై భార‌త్ ఓట‌మి పాలైంది.

ఈ మ్యాచ్ కు ముందు ఓవ‌ల్ మైదానం డ్రెసింగ్ రూంలో అనిల్ కుంబ్లేకు ..విరాట్ కు మ‌ధ్య వాగ్వాదాం జ‌రిగింద‌నే సంచ‌ల‌న వార్త ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఫైనల్ మ్యాచ్ లో ఆడ‌టానికి ముందు జ‌రిగిన మీటింగ్ లో అనిల్ ను విరాట్ నోటికొచ్చిన‌ట్లు తిట్టిన‌ట్లు తెలుస్తోంది. మీటింగ్ లో కుంబ్లే ఏం చెప్పిన వ్య‌తిరేకించిన కోహ్లీ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ దేశానికి నీ సేవ‌లు చాలు అని  మొఖం మీద‌నే చెప్పాడ‌ట‌. దాంతో తీవ్రంగా బాధపడిన కుంబ్లే రాజీనామా ఇచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here