జనసేన పార్టీ పై కామెంట్స్ చేసిన బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఆడియో వేడుకలో చేసిన కామెంట్స్ బన్నీ కెరీర్ కి చాలా దెబ్బ వేశాయి. ఓ మేరకు చెప్పాలంటే మెగా అభిమానుల మధ్య చిచ్చుపెట్టేలా బన్నీ ఆ సమయంలో మాట్లాడాడు అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇటీవల జరిగిన బన్నీ పుట్టినరోజు నాడు రాజకీయాలపై స్పందించాడు. బన్నీ మాట్లాడుతూ..రాజకీయాల గురించి తనకు పూర్తీ అవగాహన లేదని .. చిరంజీవిది ఏ పార్టీ అయితే తనది కూడా అదే పార్టీ అని ప్రస్తుతం చిరంజీవి ప్రజారాజ్యం విడిచి కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి తనది అదే పార్టీ అని .. ఒకవేళ ఆయనకూడా జనసేన లోకి వస్తే తనది అదే పార్టీ అని చెప్పాడు.
తనకంటూ పొలిటికల్ స్టాండర్డ్ లేదని చెప్పాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్తాపించినప్పటినుండి అల్లు అర్జున్, రామ్ చరణ్ లు పార్టీ కోసం ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో అల్లు అర్జున్ తర్వాత రాజకీయాలలో ఎక్కడా కనబడలేదు. అయితే ప్రస్తుతం బన్నీ చేసిన కామెంట్స్ బట్టి పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం ఇష్టం లేనట్టుంది..మొత్తంమీద పవన్ బన్నీ ల మధ్య తేడాలు వచ్చినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here