యువతిపై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎమ్మెల్యే?

బిజెపి పార్టీకి చాలా చరిత్ర ఉంది. ప్రస్తుతం దేశంలో సగానికిపైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఈ పార్టీ..కేంద్రంలో చాలా బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. విపక్షాలకు అవకాశాలు ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ఏకపక్ష దోరణితో ముందుకెళ్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బిజెపి.

అయితే ఇటువంటి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ..సమాజంలో తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తనపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మె ల్యే లైంగికదాడి చేశాడని ఓ యువతి ఆరోపించారు. తనకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తూ లక్నో లోని సీఎం యోగి ఆ దిత్యనాథ్ ఇంటి ముందు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఊనా బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్, ఆయన సోదరుడు గతేడాది జూన్‌లో నాపై లైంగికదాడికి పాల్పడ్డారు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా బెదిరింపులు మొదలయ్యాయి. నిందితులను అరెస్టు చేయాలని, లేకుంటే నాకు ఆత్మహత్యే శరణ్యం అని తెలిపారు. ఇది తనను అప్రతిష్ట పాల్జేయడానికే విపక్షాలు పన్నిన కుట్ర అని కుల్‌దీప్ సింగ్ సెంగర్ ఆరోపించారు. అయితే ఇది గమనిస్తున్న ప్రజలు మాత్రం ఇది ముమ్మాటికీ బీజేపీ ఎమ్మెల్యే పనే అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here