ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదు మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రతిపక్షపార్టీ  వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం కోసం ముందు నుంచి ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధితో పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.ఈ  క్రమంలో వైసీపీ ఎంపీలు పార్లమెంటులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనలు ఆందోళనలు చేపట్టడం జరిగింది.
ఈ క్రమంలో కేంద్రంలో ఎటువంటి వైఖరి కనబడకపోవడంతో వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు  రాజీనామా చేసి దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంపై పోరాటం మరింత ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది.
నేడు వైసీపీ ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్బంధన జరగనుంది. రేపు (బుధవారం) వైసీపీ రైల్‌ రోకో చేపట్టనుంది. ఎంపీల దీక్ష కొనసాగినంత కాలం నిరసనలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ విధంగానైనా కేంద్రంలో మార్పు వస్తుందని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని జగన్ తన పార్టీ నాయకులతో తెలిపారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here