బాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కంటే శ్రీ రెడ్డికి ఎక్కువ క్రేజ్ ఉంది: రామ్ గోపాల్ వర్మ

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి దుమారం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ప్రతి ఒక్కరి పక్కలో పడుకోవలి అని ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శక నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి కి ఉన్నా కొద్దీ ఆదరణ పెరుగుతుంది. కాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు  జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఆ మాటకు వస్తే దేశంలో మరే వుడ్ కు చెందిన నటి కూడా చేయని పని అయినా అర్ధ నగ్న ప్రదర్శనతో సంచలనంగా మారారు శ్రీరెడ్డి.
తనను మోసం చేశారంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చకు తెర తీస్తున్నాయి. ఇక, సోషల్ మీడియాతో పాటు, వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆమె ఫోటోలు, ఆమెకు సంబంధించిన వార్తలు తెగ షేర్ అవుతున్నాయి. ఇటువంటి సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శ్రీ రెడ్డిపై తన ట్విటర్ ద్వారా సంచలన కామెంట్ చేసారు…శ్రీరెడ్డి జాతీయ స్థాయిలో సెలబ్రిటీగా ఎదుగుతోందని, ముంబయిలో పవన్ కల్యాణ్ గురించి తెలియని వారు సైతం ప్రస్తుతం శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారన్నారు అన్నారు. ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి ని ఎవరూ పట్టించుకోని నేపథ్యంలో…రాంగోపాల్ వర్మ చేసిన ట్విట్ తో సంచలనం అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి గురించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్  వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here