కంటతడి పెట్టిన రేణుదేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే కుమారుడు అకీరా నందన్ ఇటీవల పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మెగా కుటుంబం హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు అకీరాకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అకీరాకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ రావడంపై రేణూ దేశాయ్ భావోద్వేగం చెందారు.
ఈ మేరకు ‘ఫేస్ బుక్’లో ఓ పోస్టు చేశారు. ‘నా కుమారుడిపై చూపిస్తున్న ఆదరాభిమానులకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అకీరాకు 14 ఏళ్లు వచ్చాయి కనుక, టెక్నికల్ గా చూస్తే బేబీ బోయ్ ఏమీ కాదు కానీ, జన్మనిచ్చిన తల్లిగా నేను ఎప్పటికీ తనను చిన్నారిగానే భావిస్తాను. తల్లి, తండ్రి తరపున గొప్ప వ్యక్తులున్న కుటుంబంలో అకీరా జన్మించాడు.. మీరు రాత్రి  నుంచి చెబుతున్న బ్యూటిఫుల్ బర్త్ డే విషెస్ కి అకీరా తల్లి గా ఎంతో భావోద్వేగం చెందాను.
మీ అందరికీ నా లిటిల్ బర్త్ డే బోయ్ తరపున థ్యాంక్యూ’ అని ఆ పోస్ట్ల్ లో పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తారు అనే ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు రేణూ దేశాయ్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here