ఆ రోజు పవన్ కళ్యాణ్ నాకు అండగా లేకపోతే నన్ను మర్చి పోయేవారు: నితిన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరే హీరో కి లేదు అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కి అభిమానులలో చాలా మంది హీరోలు ఉన్నారు…వీరిలో నితిన్ ఒకరు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. హీరో నితిన్ కాలేజీ చదువుతున్నా రోజుల నుండే పవన్ కళ్యాణ్ అంటే ఎంతో పిచ్చి అని తెలియజేశారు. ఆయన సినిమాలు చూశాక…సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని ప్రేరణ కలిగింది అని అన్నారు.
అనుకున్నానని..అలాగే వచ్చానని తన సినిమాలు మంచి విజయాలు సాధించాయని చెప్పారు. అయితే, హిట్స్ లేని సమయంలో తనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆయన (పవన్ కల్యాణ్)  ఎక్కువుగా బయటకు రారు, కానీ, నా సినిమా ‘ఇష్క్’ ఫంక్షన్ కు ఆయన వచ్చారు. బాగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ రావడం వల్లే అసలు ‘ఇష్క్’ అనే సినిమా ఉంది, హీరో నితిన్ ఇంకా ఉన్నాడని తెలిసింది.
ఆ సినిమాకు హైప్ వచ్చింది ఆయన వల్లే. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వారు దేవుడితో సమానం. అప్పుడు, నాకున్న బాధ నాకే తెలుసు. ఆ సమయంలో ఆయన (పవన్ కల్యాణ్) నాకు హెల్ప్ చేశారు’ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని అన్నారు. అంతే కాకుండా జీవితంలో ఆయన నటించే సినిమాలో చిన్న పాత్ర చేయాలని ఆశ ఉందని తన కోరిక తెలియజేశారు నితిన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here