కర్నాటక ఎన్నికల రంగంలోకి దిగిన మెగా బ్రదర్స్

త్వరలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలలో బిజీబిజీగా గడుపుతున్నాయి. రాబోయే ఎన్నికలలో జాతీయ పార్టీలు కాంగ్రెస్ బిజెపి మధ్య  తీవ్ర పోటీ నెలకొంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న జేడీఎస్ పార్టీ కూడా తన వ్యూహాలను సిద్ధం చేసుకొని ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నది. అయితే కన్నడ రాష్ట్రంలో ఎక్కువగా తెలుగువారు ఉండటంతో..రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తెలుగువారి ఓట్లపై దృష్టిపెట్టాయి.
కర్ణాటక – ఆంధ్రా సరిహద్దు జిల్లాలైన బళ్లారి – గుల్బర్గా – బీదర్ తదితర ప్రాంతాల్లో జయాపజయాలను నిర్ణయించగలిగే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. మరోవైపు బెంగళూరులోనూ పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తెలుగువారే. దీంతో వారిని ఆక్టుటకునేందుకు మెగా బ్రదర్స్ ను ఆయా పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. తాజా కర్ణాటకలో ప్రచారం జరుగుతున్న ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి షెడ్యూల్ ఖరారైంది.
త్వరలో పవన్ టూర్ సైతం ఓకే కానుందని ఆయన జేడీఎస్ తరఫున ప్రచారం చేయనున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొంది…అన్నీ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విజయవకాశాలు దకుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here