సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పిస్తాం అంటున్న లేడి నిర్మాత

బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తరహా సినిమాలు తీయడంలో ముందు ఉండే లేడీ నిర్మాత ఏక్తాకపూర్. ప్రస్తుతం ఈ నిర్మాత శృంగారానికి సంబంధించి ఓ వెబ్ సిరీస్ మొదలు పెట్టాలని చూస్తుంది. ఈ వార్త వినగానే రసిక ప్రియులు ఏక్తాకపూర్…ఈ సిరీస్ ఎప్పుడు మొదలు పెడుతుందా..అని ఎదురుచూస్తున్నారు. ఏక్తాకపూర్  కామసూత్ర నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ నిర్మించే సన్నాహాలు చేస్తుంది. రసిక హృదయాలు కొల్లగొట్టేలా ఈ సినిమా ఉంటుందని బి టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
డర్టీ పిక్చర్ పేరుతొ విద్యాబాలన్ ను మెయిన్ లీడ్ గా తీసిన సినిమా అప్పట్లో ఓ రేంజ్ సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆలోచనలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. యూత్ కి సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు నేర్పాలనే ఆలోచనతో ఈ కామసూత్ర వెబ్ సిరీస్ చేస్తుందట. మంచి దర్శకుడు దొరికితే వెంటనే మొదలు పెడుతుందట. మరి ఈ సినిమా తీసి ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి. అయితే ఏక్తా కపూర్ మాత్రం పాశ్చాత్య దేశాల కన్నా చాలా క్లారిటీగా ఈ వెబ్ సిరీస్ నిర్మించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here