కంటతడి పెట్టుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల కృష్ణజింకల వేట విషయంలో జైలు కెళ్లడం జరిగింది. ఈ పరిణామంతో చాలామంది సల్మాన్ ఖాన్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే అనూహ్యంగా రెండు రోజులకు బెయిల్ రావడంతో సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎంతగానో ఆనందించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్  తన అభిమానులు తన మీద చూపిస్తున్న అభిమానానికి కంటతడి పెట్టుకున్నారు.
జీవితంలో మిమ్మల్ని ఎప్పటికి మర్చిపోనని…మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.తన పట్ల అభిమానులు చూపెడుతోన్న ప్రేమకు, తనకు ఇస్తోన్న మద్దతుకు తాను థ్యాంక్స్‌ చెబుతున్నానని ట్వీట్ చేశాడు. కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. శిక్ష పడిన వెంటనే ఆయన తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశాడు. జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో రెండు రోజులు ఉన్న సల్మాన్‌ కి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here