రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. అన్యాయంగా విభజనకు గురై అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు అన్నారు. అంతేగాకుండా రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మళ్లీ అదే విధంగా ప్రతిపక్ష పార్టీ ఎంపీలు చేస్తున్న దీక్ష పై విరుచుకుపడ్డారు లోకేష్. వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష ప్రత్యేక హోదా కోసం కాదు జగన్ పై  కేసులు కొట్టేయడానికి అని ఎద్దేవా చేశారు.
అప్పట్లో కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీని ఎన్టీఆర్ ఎదిరిస్తే.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో సీఎం చంద్ర‌బాబు మోడీ స‌ర్కార్‌ను ఎదిరించార‌న్నారు. దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసిన ఘ‌న‌త ఒక్క చంద్ర‌బాబుకే దక్కుతుంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం సీఎం చంద్ర‌బాబులా ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడార‌ని, కానీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం ఏపీలోని గ‌ల్లీల్లో పాద‌యాత్ర అంటూ తిరుగుతూ ఏపీ అభివృద్ధి కోసం పాటుప‌డుతున్న చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్నారు. ముందు నుంచీ రాష్ట్ర అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు వైయస్ జగన్ అని పేర్కొన్నారు లోకేష్. జగన్ జైలు కి  వెళ్లే అంతవరకూ ఈ రాష్ట్రం బాగుపడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here