మూడు రూపాయలకే 1జీబీ డేటా

రిల‌యన్స్ జియో టెలికాం రంగంలో ఎంత అల‌జ‌డి సృష్టించిందో అంద‌రికి తెలిసింది. ఫ్రీ యాక్టివేష‌న్, ఆఫర్స్ తో అద‌రగొట్టిన జీయో దెబ్బ‌కు అగ్ర‌టెలికాం సంస్థ‌లు కుదేలైపోయాయి.  ఏర్ టియ‌ల్ , ఐడియాలు ఫ్రీ ఆఫ‌ర్స్  తో త‌ట్టుకోలేక‌పోతున్నామంటూ ట్రాయ్ కు లేఖ‌రాసింది. దీంతో జీయో కు కొంచెం న‌ష్టం వాటిల్లినా …త‌న‌దైన శైలిలో ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ వినియోగ‌దార్ల‌ను ఆక‌ట్టుకుంది. అయినా జియోతో పోటీ ప‌డేందుకు పోటీలు ప‌డీమ‌రి ఆఫ‌ర్ల‌మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. రోజుకో ఆఫ‌ర్ తో ఆకట్టుకుంటూ వినియోగ‌దారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

నిన్న‌టి ఆఫ‌ర్ మంచిద‌నుకుంటే నేటి ఆఫ‌ర్ ఓహో బ్ర‌హ్మాండం అనేలా వొడాఫోన్  రూ.6కే అపరిమిత డేటా ప్ర‌క‌టించింది. మేం త‌క్కువ‌తిన‌లేదంటూ ప్ర‌భుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.5కే రోజుకు 4జీబీ 3జీ డేటా ను ప్రకటించింది. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో ఎయిర్‌సెల్ గుడ్ మార్నింగ్ ప్యాక్ తో  కేవలం మూడు రూపాయలకే 1జీబీ 3జీ డేటాను ఆఫర్ ను విడుద‌ల చేసింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 1జీబీ 3జీ డేటాను కేవ‌లం రూ3 ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ను వినియోగించుకునేందుకు వినియోగదారులు *121*100# డయల్ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here