తిర‌గ‌బ‌డ్డ రైత‌న్న‌..కంగుతిన్న నారాలోకేష్

మంత్రినారాలోకేష్  రైత‌న్నలు తిర‌గ‌బ‌డ్డారు. పంట‌కు రావాల్సిన డ‌బ్బులు రాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన సుబాబుల్ రైతులు చిన‌బాబులోకేష్ ను ముప్పుతిప్ప‌లు పెట్టించారు. ఇవాళ త‌మ బాధ‌ను వెళ్ల‌బోసుకునేందుకు గుంటూరు, కృష్ణా రైతులు లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రైత‌న్న‌లు త‌మ పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌లు రావ‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ ద‌శ‌లో లోకేష్ పై మాట‌ల దాడికి దిగారు. మూడేళ్లుగా తమ డబ్బుల కోసం మార్కెట్‌ యార్డ్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం..310 మంది రైతులకు సుమారు రూ.10 కోట్లు లేదని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు.

దీంతో ఓపిక స‌హించిన లోకేష్ కొంత‌కాలం ఓపిక‌తో ఉండండి..మీడ‌బ్బులు మీకు వ‌స్తాయంటూ సూచించారు. దీంతో ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలి, మూడేళ్లపాటు తాము ఓపిక పట్టామంటూ ప్రశ్నించడంతో లోకేశ్ కంగుతిన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here