ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోనున్న నాటి హీరోయిన్‌!

అందంతో.. అభిన‌యంతో.. అంత‌కు మించి క్లాసిక‌ల్ డ్యాన్స్ తో త‌న‌దైన ముద్ర వేసిన న‌టి శోభ‌న‌. అభినంద‌న‌.. రుద్ర‌వీణ‌.. అల్లుడుగారు.. రౌడీగారి పెళ్లాం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలు చేసింది శోభ‌న‌. అప్ప‌టి హీరోయిన్ ఇప్ప‌టివ‌ర‌కూ పెళ్లి చేసుకున్న‌ది లేదు. త‌న జీవితాన్ని నృత్యానికి అంకితం చేసిన‌ట్లుగా చెప్పేవారు. 47 ఏళ్ల లేటు వ‌య‌సులో ఆమెకు ఉన్న‌ట్లుండి పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.
దేశ విదేశాల్లో ఆమె నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు మంచి డిమాండ్ ఉంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో.. వేర్వేరు వేదిక‌ల మీద ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన ఆమె.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. కుటుంబానికి బాగా తెలిసిన వ్య‌క్తినే ఆమె పెళ్లాడ‌నున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే.. శోభ‌న పెళ్లికి సంబంధించిన వివ‌రాల్ని అధికారికంగా ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డించింది లేదు.
దాదాపు ఏడేళ్ల కింద‌ట (2001లో) ఒక అమ్మాయిని ద‌త్త‌త తీసుకొని పెంచుకుంటున్నారు. ఆ అమ్మాయికి అనంత నారాయ‌ణి అన్న పేరు పెట్టారు. నాలుగేళ్ల క్రితం ఆమె వెండితెర మీద చివ‌ర‌గా క‌నిపించారు. మ‌ల‌యాళ చిత్రం థిర‌లో త‌ళుక్కుమ‌న్న ఆమె.. ద‌క్షిణాది నాలుగు భాష‌ల్లో దాదాపు 200ల‌కు పైగా సినిమాల్లో న‌టించారు. ఆమె న‌ట‌కు ప‌లు అవార్డులు.. ప్రేక్ష‌కుల రివార్డుల్ని సాధించారు. వివాదాల‌కు దూరంగా త‌న‌దైన రీతిలో ఉండే శోభ‌న.. ఈ వ‌య‌సులో పెళ్లికూతురు కావ‌టం కాసింత ఆస‌క్తిక‌ర‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here