గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పైన యోగా ముద్ర ..

యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంపద గా అందరూ పాటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్త యోగా దినోత్సవం అయిన నిన్న చైనా లో ప్రజలు ఈ పండగ ని ఘనంగా జరుపుకున్నారు. యోగా డే లో భాగంగా భారత్ అంతమంది యోగా చేసేది చైనా లో మాత్రమె అవ్వడం విశేషం. యోగా డే ఉండాలి అనే ప్రతిపాదన భారత్ చెయ్యగానే దాన్ని సమర్ధించింది చైనానే. ప్రతీ సంవత్సరం అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది ఈ దేశం. భారత రాయభారి కార్యాలయం ఫుల్ సపోర్ట్ ఇవ్వడం తో యోగాసనాలు ఈ సారి ఏకంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద సాగాయి. గ్రేట్ వాల్ మీదుగా వేలాది మంది ఈ యోగాసనాలు వేస్తూ అందరికీ యోగా గొప్పతనం చూపించారు.

రకరకాల ఆసనాలతో చైనీయులు ఘనంగా ఈ వేడుక చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఈ యోగా దినోత్సవం మంచి ప్రాచుర్యం పొందుతోంది. చైనా రాజధాని బీజింగ్ లో ఒకేసారి ఐదు వేల మంది యోగా కార్యక్రమం చేసారు. దేశం లో నివసించే ఇండియన్ కమ్యునిటీ జనాలతో పాటు అందరూ కలిసి ఈ వేడుక చేసుకున్నారు, భారత యువతీ యువకులకి సైతం కొందరు చైనీయులు ఈ యోగా ఎలా చెయ్యాలి అనేది చూపించడం విశేషం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here