వైసీపీలోకి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

తాను ప్ర‌త్యేక్ష రాజ‌కీయాల్లో రాను అంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ప్ర‌భుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల‌   సీఎం చంద్ర‌బాబును, టీడీపీ నేతల్ని వ్య‌తిరేకిస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు షేర్ చేస్తున్నారు. దీనిపై తెలుగు త‌మ్ముళ్లు గుర్రుగా ఉన్నార‌ట‌. అందుకే ఐవైఆర్ తీరును చంద్ర‌బాబుతో  మొర‌పెట్టుకున్నార‌నే వార్తలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
ఇటీవల ఐవైఆర్ ఓ భేటీ నిర్వ‌హించారు. ఆ భేటీకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాకుండా వైసీపీ నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈభేటీలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ సమన్వయకర్తలుగా వైసీపీ నేత‌ల్ని నియ‌మించారు. దీనిపై రుసరుస‌లాడిన‌ తెలుగు త‌మ్ముళ్లు ఐవైఆర్ గురించి త‌మ అధినేత వ‌ద్ద అక్క‌సువెళ్ల‌గ‌క్కిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇలా ఐవైఆర్  ప్ర‌భుత్వాన్ని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణీకి ప‌న్నుమిన‌హ‌యింపుపై స్పందించిన కృష్ణారావు..చరిత్ర‌వ‌క్రీక‌రించిన సినిమాకు ప‌న్నుమిన‌హాయించ‌డం చోద్య‌మంటూ కామెంట్ చేశాడు.
సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శిస్తున్న ఇంటూరీ ర‌వి కిర‌ణ్  అరెస్ట్ ను వ్య‌తిరేకిస్తూ..ఆయ‌న‌కు మ‌ద్దతుగా నిలిచారు.బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌కుండా దాట‌వేస్తున్న‌ట్లు ఆ వ‌ర్గానికి చెందిన ప్ర‌తినిథులు గుర్రుగా ఉన్నారు. దీనిపై చంద్ర‌బాబు తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా విఫ‌లం అయ్యాయ‌ని ..అందుకే సీఎస్ చంద్ర‌బాబు తీరును ఎండ‌గ‌డుగున్నార‌నే వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.
మ‌రోవైపు ఐవైఆర్ వైసీపీ నేత‌ల‌కు అధిక ప్రాధాన్య‌త …మాజీ సీఎస్ అయినా ప్ర‌భుత్వ‌తీరును విమ‌ర్శించ‌డంలాంటి చ‌ర్య‌ల‌తో కృష్ణారావు భ‌విష్య‌త్తుల్లో వైసీపీ నుంచే రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు నెటిజ‌న్లు చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here