రేప్ చేసేందుకు యత్నించిన స్వామీజీ తండ్రిలాంటివాడు..మర్మాంగం కోయలేదన్న యువతి

కొద్దిరోజుల క్రితం ఓ యువతి తనపై అత్యాచారానికి పాల్పడ్డ స్వామిజీ మర్మాంగాన్ని కోసి దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడుతుంటే ప్రతిఘటించి యువతి చేసిన దైర్యాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మెచ్చుకున్నారు. అయితే తాజాగా యువతి బాంబు పేల్చేలా వ్యాఖ్యలు చేసింది. స్వామిజీ తనకు తండ్రిలాంటి వాడని..మర్మాంగం కోయలేదని..కావాలనే పోలీసులు అలా చెప్పించారనే వెల్లడించింది.
ఎర్నాకులం జిల్లా కొల్లాంలోని పద్మా చట్టంబి స్వామి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో గంగేశానంద తీర్ధ పాద ఉండేవాడు. అయితే అదే ఆశ్రమంలో ఉండే యువతిపై కన్నేశాడు. అంతే ఓ రోజు ఒంటిరిగా ఉన్న యువతిని రేప్ చేసేందుకు యత్నించగా ప్రతిఘటించిన యువతి స్వామీ మర్మాంగాన్ని కోసేసింది. దీంతో తీర్ధ పాద కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని విచారించగా..తనను లోబరుచుకోవాలని యత్నిస్తే పదునైన కత్తితో మర్మాంగాన్ని కోసినట్లు తెలిపింది. దీంతో ఆయవతి పై దేశ వ్యాప్తంగా మద్దతు పలికారు. స్వామిజీ మర్మాంగాన్ని కోసేసినందుకు సీఎం పినరయి విజయన్ సైతం బాలికను అభినందించాడు.
మరోవైపు స్వామిజీ గంగేశానంద మాత్రం ఎందుకు పనికి రావడంలేదని తన మర్మాంగాన్ని తానే కోసుకున్నట్లు వింత సమాధానం చెప్పడంతో పోలీసులు వాంగ్మూలాన్ని రాసుకున్నారు.
ఇదిలా ఉంటే తనకు అయ్యప్పదాస్ అనే మరో వ్యక్తితో సంబంధముందని యువతి పేర్కొంది. అయ్యప్పదాస్ కు, స్వామిజీకి మధ్య ఆర్థిక వివాదాలున్నాయని..స్వామీజీ మర్మాంగాన్ని కోయలేదని..తనకు తండ్రిలాంటి వాడేని చెప్పింది. దీంతో కంగుతిన్న పోలీసులు యువతి..గంగేశానందతో మాట్లాడిన ఫోన్ కాల్ లిస్ట్ ను  స్వామిజీ తరుపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here