అల్లు అర్జున్ గ‌త జ‌న్మ వింటే షాక్..!

గ‌త జ‌న్మలో మ‌నం ఎక్క‌డ ఏ రూపంలో జన్మించాం? అనే ప్ర‌శ్న ప్ర‌తి ఒక్క‌రిలో విప‌రీత‌మైన ఆస‌క్తి క‌లిగిస్తుంది. అయితే ఎలా తెలుసుకోవాలో ఎవ‌రికీ తెలియ‌దు. అయితే, గత జన్మ రహస్యమేంటో తాను చెబుతానంటున్నారు ఎస్వీ నాగనాథ్ అనే ఆస్ట్రో సైకాలజిస్ట్. ప్రతి సెలెబ్రిటీకి చెందిన గత జన్మ గురించి చెబుతానంటున్నారు.
గ‌త జ‌న్మ ఆవిష్క‌ర‌ణ 
న‌మ‌స్తే తెలుగు చానల్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో ఎస్వీ నాగనాథ్ సెలెబ్రిటీల గత జన్మ రహస్యాలను చెబుతున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో స్ట‌యిలీష్ స్టాఆర్ అల్లు అర్జున్ గత జన్మ విశేషాలను వివరించారు. గత జన్మలో బ‌న్నీ ఎలా ఉండేవాడు..? ఆయన మనస్తత్వమేంటి..? వ‌ంటి ఆస‌క్తిర‌మైన విష‌యాల‌ను తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.
అప‌ర భ‌గీర‌థుడు
గ‌త జ‌న్మ‌లో బ‌న్నీ  ఉత్త‌ర భార‌తంలో సాధర‌ణ రైతు కుటుంబంలో జ‌న్మించాడ‌ని నాగ్‌నాథ్ తెలిపారు. బ‌న్నీకి ఒక‌సమ‌యంలో ఆపార గుప్త‌నిధి దొరికింద‌ని, ఆ నిధిని అంతా స‌మాజ శ్రేయ‌స్సుకు ఉప‌యోగించాడ‌ని ఆయ‌న తెలిపారు. నీటి కోసం భగీరధ ప్ర‌య‌త్నాలు చేశాడ‌ని చెప్పుకొచ్చాడు. పూర్వ‌జ‌న్మ‌లో బ‌న్నీ మ్యారేజ్ స్టేట‌స్, చివ‌రి ద‌శ‌లో ఏం చేశాడు? అనే విష‌యాల‌ను వివ‌రించాడు నాగ్‌నాథ్.
నేను ఎవ‌ర్నీ..?
న‌మ‌స్తే తెలుగు ఛాన‌ల్‌లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ప్రముఖుల గ‌త జ‌న్మ ర‌హస్యాల‌ను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్ర‌సార‌మైన అల్లు అర్జున్ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
 
వైర‌ల్ అవుతున్న ప్రొగ్రాం
సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌ల‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని, ప్ర‌తి వారం ఒక ఎపిసోడ్ ప్ర‌సార‌మ‌వుతుంద‌ని ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్ర‌సారం చేసిన అల్లు అర్జున్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెల‌బ్రెటీల పాస్ట్ లైఫ్‌ల‌ను ఆవిష్క‌రించే ఇలాంటి కార్య‌క్ర‌మం మీడియా చ‌రిత్ర‌లో తొలిసార‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here