మన దేశం లో ఒక ఊరి పేరు .. డోనాల్డ్ ట్రంప్

అమెరికన్ ల ఉద్యోగాలు పీకేసుకునేది భారతీయులే అనీ భారతీయులతో పాటు అనేక దేశాల వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తా అంటూ బహిరంగంగానే చెప్పే డోనాల్డ్ ట్రంప్ అంటే తెలుగు, ఇండియన్ , ఇతర దేశాల ఉద్యోగులకి హడల్. ఎక్కడ సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ మొత్తం ఈ ట్రంప్ కుప్ప కూల్చేస్తాడో అని భయపడుతూ ఉంటారు వారు. అతని మీద మనోళ్ళు ఎప్పుడూ సీరియస్ గానే ఉంటారు. మరొక పక్క ప్రముఖ సామాజిక కార్యకర్త సులభ్ ఇంటర్నేషనల్ ని స్థాపించిన బిందేశ్వర్ పాతక్ ఇండియా కీ అమెరికా కీ మధ్యన మధ్య దౌత్య సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకు తన ప్రయత్నం తానూ చేస్తున్నారు.

ఇందులో భాగంగా భార‌త్‌లోని ఓ గ్రామానికి ట్రంప్ పేరు పెట్ట‌బోతున్నట్లు తెలిపారు. వాషింగ్టన్ లో ఓ కమ్యూనిటీ ఈవెంట్ సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. రాజస్థాన్ లోని ఒక ప్రాంతం లో అభివృద్ధి దశ లో ఉన్న ఒక గ్రామానికి అయన ట్రంప్ పేరు పెట్టబోతున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here