పారిపోయిన ఖైదీ కోసం లవర్ తో ఫోన్ చేయించిన పోలీసులు .. ఆమె కోసం అతను వచ్చాడా ? దొరికాడా?

పోయిన నెలలో ఎస్కార్ట్ పోలీసులకి మస్కా కొట్టి పారిపోయిన రిమాండ్ ఖైదీ అత్తినేని చంద్రమోహన్ మొత్తం మీద దొరికాడు. సినిమా ఫక్కీ లో లవర్ ని కలవడం కోసం వచ్చిన అతను అడ్డంగా దొరికాడు. జగిత్యాల కి చెందిన దాదాపు ఎనిమిది ప్రత్యెక బృందాలు అతనికోసం వెతుకుతూ ఉంటె 15 రోజులుగా దొరకని అతను. ప్రేయసి ని కలవడం కోసం రహస్యంగా స్వగ్రామానికి వచ్చి దొరికాడు. అతని సొంత గ్రామస్తులు అతను రావడం గమనించి బంధించి మరీ పోలీసులకి అప్ప జెప్పారు.

తన లవర్ కోసం అతను వచ్చి తీరతాడు అని తెలిసి ఆమెతో పోలీసులే ఫోన్ చేయించారు అనే సమాచారం కూడా వినిపిస్తోనిడ్ మరి. అతను ఆమె కోసం ప్రేమగా రావడం అతని ఫ్రెండ్స్ అతన్ని పట్టుకోవడం ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here