డివివి నిర్మాతగా రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమా

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మింనగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషనలో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి2 తో రికార్డులు తిరగరాశారు. ఈ నేపథ్యంలో డివివి దానయ్య నిర్మాతగా రాజమౌళి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు హీరో,హీరోయిన్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. దీనిగురించి త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. తన తదుపరి సినిమాకు ప్రభాస్ బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నాడట.

ప్రస్తుతం ప్రభాస్  సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు.  బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముకేశ్ ఇందులో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషించ‌నున్నాడు. కాగా సాహో విడుదల అనంతరం ప్రభాస్ , రాజమౌళి కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభం కావచ్చుననే అంచానావేస్తున్నారు ఫిల్మిం క్రిటిక్స్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here