బతికుండగానే తల్లి డెత్ సర్టిఫికేట్ సంపాదించిన కొడుకు..

కలికాలం కలికాలం అని పెద్దలు అంటుంటే వినేవాళ్ళం కానీ ఇలాంటి సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. అల్లారు ముద్దుగా పెంచినా కన్న కొడుకు చివరికి బతికుండగానే తల్లిని చంపేసాడు  .. నిజంగా చంపేసినా ఆమె అంతగా బాధ పడేది కాదేమో .. అతను ఆమె పేరుమీద ఉన్న ఆస్తుల కోసం ఆమె చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ పుట్టించి ఆమె క్షోభ కి గురయ్యేలా చేసాడు. హైదరాబాద్ నేరేడిమేట్ లోని ఈ సంఘటన అందరికీ షాక్ ఇస్తోంది. తల్లి తండ్రులకి దండిగా ఆస్తులు ఉండడం తో తల్లి ప్రసూనాంబ పేరుమీద ఉన్న ఈ ఆస్తులని కాజేయడం కోసం కొడుకు కుట్ర పన్నాడు.

డబ్భై సంవత్సరాల తల్లి బతికి ఉన్నా లేదు అని చెబుతూ సర్టిఫికేట్ పుట్టించిన జంధ్యాల విష్ణు కుమార్,  ఆ ఆస్తి కోసం ఒక కుయుక్త లాయర్ తో కలిసి ఈ పన్నాగం వ్హేసాడు. త‌ల్లి ప్ర‌సూనాంబ‌ (70) స్థానిక పోలీసుల‌కు త‌న కొడుకు వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడు జంధ్యాల విష్ణుకుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here