నువ్వు తోపురా ట్రైలర్ .. పిచ్చగా ఎక్కేస్తోంది అందరికీ :

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో నాగరాజు పాత్ర చేసిన సుధాకర్ గుర్తు ఉన్నాడా ? ఈ కుర్రాడు ఆ సినిమాలో బాగానే యాక్ట్ చేసాడు అని అన్నారు అందరూ కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో ఇప్పటి వరకూ సరైన బ్రేక్ అనేది లేనే లేదు. ఈ మధ్యన అతను నువ్వు తోపు రా అనే సినిమాతో అందరికీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది. ఇండియా నుంచి , హైదరబాద్ కుర్రాడు అమెరికా వెళ్ళడం అక్కడ ఒక పొగరెక్కిన క్రిమినల్ గా అతని వేషాలు, అతనికి అక్కడ జనాల నుంచి ఎదురైనా షాక్ లూ ఇవన్నీ కలిపి కొట్టిన ట్రైలర్ సూపర్ అనిపిస్తోంది.

‘‘నా తల్లిబెట్టిన పేరు సూరి. నేన్జేసిన లొల్లిబెట్టిన పేరు షేర్ సూరి’’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ట్రైలర్. ‘‘మా అమ్మన్దిడితే నా బ్లడ్డు బాయిలై నా హెడ్లకస్తది. గది నీ బ్లడ్ జూసినంక కూలైతది’’.. ‘‘గిది అమెరికా. ఇలా సాగుతుంది ఈ ట్రైలర్. చాలా ఆసక్తికరంగా తీసిన ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here