దాసరి మరచిన వాళ్ళు ఆమె ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి

సరిగ్గా పది రోజుల క్రితం దర్శకరత్న దాసరి తుది శ్వాసని విడిచారు. ఆయన సినిమా పరిశ్రమ లో ఎందరికో ఆదర్శంగా నిలవడమే కాకుండా చాలా జీవితాలు నిలల్బెట్టారు కూడా. దాసరి వలన జీవితం నేర్చుకున్న వారిలో చాలా మంది ఆఖరి చూపుకి కూడా రాలేదు. ఆయన వలన లబ్ది పొందిన వాళ్ళు కూడా ఇక్కడ కనపడలేదు. అయితే పేరు కోసం కాకుండా జీవితం ఇచ్చిన మరొక సీనియర్ డైరెక్టర్ విశ్వనాథ్ ని  గాడ్ ఫాథర్ లాగా గౌరవించిన నటి తులసి గురించి చెప్పుకోవాలి.

శంకరాభరణం ద్వారా తెలుగు పరిశ్రమ కి వచ్చిన తులసి సినిమా రంగం లో ఇప్పుడు మంచి గుర్తింపు తో ఉన్నారు. విశ్వనాథ్ పేరు మీద ఆమె ప్రతి సంవత్సరం అవార్డుల వేడుక చేయాలని నిర్ణయించింది. పురస్కారాల ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఈ ఏడాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 20న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహం ముఖ్య అతిధి గా వస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here