పెళ్లి చేసుకుంటావా యాసిడ్ పోయ్యనా .. సంబంధాలు అన్నీ చెడ గొట్టాడు

ప్రేమ ప్రేమ అంటూ జీవితాంతం వెనకాల పడేవాళ్ళు ఉంటారు , ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటె చాలులే అనుకునేవాళ్లు కూడా ఉంటారు  .. జ్ఞాపకాలతో ఒక జీవితం మొత్తం గడిపెసేవారిని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇతను మాత్రం తాను ఇష్టపడిన అమ్మాయి వేరేవారిని పెళ్లి చేసుకోకూడదు అంటూ బెదిరిస్తున్నాడు. తన మాట వినకపోతే యాసిడ్ పోస్తా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.

హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులకి ఆమె ఫిర్యాదు చేయడం తో నిర్భయ కేసుని పెట్టి అతన్ని లోపల వేసారు. ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌లో నివసించే బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినికి ఓ యువ‌కుడి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. తనను వేధిస్తోన్న ఆ యువ‌కుడు బీదర్‌కు చెందిన సందీప్‌(25) అని ఆ యువ‌తి చెప్పింది.

పెళ్లి చేసుకోవాలి అని బలవంతం పెడుతున్న అతనితో ముందు జీవితం లో స్థిరపడమని చెప్పాను అనీ దాంతో అతను తనమీద కోపం తెచ్చుకుని సోషల్ మీడియా లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు అన్నది ఆమె. త‌న‌కు ఆ యువ‌తికి ఎంతో క్లోజ్ అంటూ అస‌త్యాలు ప‌లికి వివాహం ర‌ద్ద‌య్యేలా చేశాడు. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here