2020 చివరి వరకు వర్క్ ఫ్రం హోమ్

ప్ర పంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆర్థిక కార్యాకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సాఫ్ట్‌వేర్, మీడియా తదితర వర్గాలకు చెందిన చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. భారత్‌లో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. వైరస్‌ వ్యాప్తి నుంచి కాస్త ఊరటపొందిన దేశాలు కూడా ఇప్పుడే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్ధంగా లేవు. పలు కంపెనీలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం , సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.

తమ ఉద్యోగులకు 2020 చివరి వరకు కల్పించాలని టెక్నాలజీ దిగ్గజాలు ఫేస్‌బుక్‌, గూగుల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేసే సంస్కృతిని కొనసాగించాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయని సమాచారం. ఇప్పటికే ఉద్యోగులకు ఇందుకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి.

Must Read:

జులై 6 వరకు కార్యాలయాలను తెరవబోమని ఫేస్‌బుక్‌ గతంలోనే ప్రకటించింది. అయితే.. వైరస్ భయం వెంటాడుతూనే ఉన్న ప్రస్తుత తరుణంలో కార్యాలయాలను పున:ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదనే నిర్ణయానికి వచ్చాయి. దీంతో పాటు ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించినా.. పని నాణ్యత విషయంలో పెద్దగా తేడా లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని గూగుల్, ఫేస్‌బుక్ యాజమాన్యాలు నిర్ణయించినట్లు సమాచారం.

మరోవైపు లాక్‌డౌన్ ప్రభావంతో పలు రంగాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది. దీంతో అది ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులకు కల్పించే అదనపు అలవెన్సులు, జీతాల్లో భారీగా కోత విధించగా.. పలు కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here