వామ్మో!! భారీ దోపిడీ.. రూ.8 కోట్ల బంగారం, వజ్రాలు చోరీ

లాక్‌డౌన్ వేళ దోపిడీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కరోనా కారణంగా షాపులు, ఫ్యాక్టరలు మూతపడడంతో ఇదే అదనుగా దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా గోల్డ్ ఫ్యాక్టరీలో చొరబడి ఎనిమిది కోట్ల రూపాయల విలువై బంగారం, వజ్రాలు దోచుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. ఫ్యాక్టరీ పైకప్పు తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు ఉన్న బంగారాన్నంతా ఊడ్చేశారు. ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ ఫుటేజీ క్యాసెట్లను సైతం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ముంబైలోని ప్రాంతంలో వెలుగుచూసింది.

అంధేరీ ప్రాంతంలోని నీరజ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.8 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకెళ్లారు. ఫ్యాక్టరీ పై కప్పు తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు విలువైన ఆభరణాలను అపహరించారు. బంగారు నగలు తయారు చేసే సమయంలో మిషన్ల నుంచి వెలువడే బంగారు ధూళిని(రేణువుల)ను కూడా తుడిచేసి పట్టుకెళ్లారు.

Also Read:

ఫ్యాక్టరీలోని విలువైన వస్తువులను ఒకసారి చూసుకునేందుకు వచ్చిన యజమాని రాజ్‌కుమార్ లుత్రా షట్టర్లు తీసి లోపలికి వెళ్లి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి గురైన వస్తువులపై ఆరా తీశారు. దొంగలు బంగారం, వజ్రాలు భద్రంగా దాచి ఉంచిన లాకర్‌ని గ్యాస్ కట్టర్ సాయంతో కోసేసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

Read Also:

ఫ్యాక్టరీ పై కప్పు కొంతభాగం తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. ఆభరణాల తయారీ సమయంలో వేస్ట్‌ కింద వచ్చే బంగారు ధూళిని కూడా ఊడ్చేశారని రాజ్‌కుమార్ పోలీసులకు చెప్పారు. అలాగే ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఫ్యాక్టరీలోని సీసీకెమెరాల ఫుటేజీ స్టోర్ చేసే పరికరాలను కూడా ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here