వలస కార్మికులపై యోగి ప్ర‌భుత్వం సాహాసోపేత నిర్ణ‌యం

క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో ల‌క్ష‌లాది వ‌ల‌స కూలీలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఎక్కువ‌మంది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ సాహాసోపేత నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి‌న తమ రాష్ట్ర‌వాసుల‌ను వెన‌క్కి తీసుకొస్తామ‌ని తాజాగా వెల్ల‌డించారు.

Must Read:

శుక్ర‌వారం తాజాగా రాష్ట్ర కేబినెట్ స‌మావేశ‌మైంది. త‌మ రాష్ట్రానికి చెందిన వ‌ల‌స కూలీల‌ను వెనక్కి ర‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా క్వారంటైన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. నెగిటివ్‌గా తేలిన త‌ర్వాతే వారిని త‌మ సొంత ఊళ్ల‌కు పంప‌నున్న‌ట్లు యోగి తెలిపారు.

Must Read:

మ‌రోవైపు ఇటీవ‌లే రాజ‌స్థాన్ నుంచి వేలాది సంఖ్య‌లో విద్యార్థుల‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌మ సొంత‌గ్రామాల‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. కోట న‌గ‌రంలో పోటీ పరీక్షలకు శిక్ష‌ణ పొందుతూ, లాక్‌డౌన్ కార‌ణంగా చిక్కుకుపోయిన విద్యార్థులను 250 బ‌స్సుల్లో యోగి ప్ర‌భుత్వం యూపీకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా 20 క‌రోనా పాజిటివ్ కేసులు దాటిన జిల్లాల్లో ప్ర‌త్యేకంగా ఇద్ద‌రు సీనియ‌ర్ అధికారుల‌ను నియ‌మించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తాజాగా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here