లాక్‌‌డౌన్ సడలింపుపై కేంద్రానికి చిదంబరం కీలక సూచన

రోడ్డు, వాయు రవాణా కార్యకలాపాలకు అనుమతించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి కోరారు. ఆర్ధిక, వాణిజ్య కార్యక్రమాలు సమర్ధవంతంగా పునఃప్రారంభానికి ఇదే ఏకైక మార్గమని అన్నారు. ఇక, ఎంపిక చేసిన మార్గాల్లో అంతరాష్ట్ర రైలు సర్వీసులను ప్రారంభించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. నెలన్నర రోజులకు పైగా నిలిచిపోయిన రైలు సర్వీసులను మే 12 నుంచి ప్రారంభించినున్న విషయం తెలిసిందే. తొలుత 15 రైళ్లను న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలకు నడుపుతారు.

ఆర్ధిక, వాణిజ్య కార్యకలాపాలు సమర్ధవంతంగా ప్రారంభం కావాలంటే ప్రయాణికులు, సామాగ్రిని తరలించడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలకు అనుమతించాలని చిదంబరం ట్వీట్ చేశారు. కట్టడికి విధించిన దృష్ట్యా నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పేదలకు ఉపశమన ప్యాకేజీ, పరిశ్రమలకు సహాకరించే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను కూడా ప్రకటించాలని ఆ పార్టీ కోరుతోంది. మే 17తో లాక్‌డౌన్ ముగియనుండగా.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ

కాగా, ఢిల్లీ నుంచి డిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై తిరువనంతపురం, మెడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను మే 12 నుంచి నడపనున్నారు. ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు సోమవారం (మే 11) సాయంత్రం 4 గంటల నుంచి మొదలు కానున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకొనే వీలు కల్పించారు. రిజర్వేషన్‌ కౌంటర్లను మూసే ఉంచనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here