దేశంలో 24 గంటల్లో 4214 కరోనా కేసులు.. ఇదే అత్యధికం

దే శంలో ఒక్క రోజులో అత్యధికంగా 4,214 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. సోమవారం (మే 11) నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 67,152కు ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో 44,029 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 20,917 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారని ఆయన తెలిపారు.

గడిచిన 24 గంటల్లో 4,214 కొత్త కేసులు నమోదవ్వగా.. 1559 మంది డిశ్చార్జి అయ్యారని లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో కరోనా రికవరీ రేటు మరింత మెరుగైందని తెలిపారు. భారత్‌లో రికవరీ రేటు 31.15 శాతానికి చేరిందని ఆయన చెప్పారు.

మహారాష్ట్ర కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 868కి చేరింది. మహారాష్ట్రలో సోమవారం 1236 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 23 వేలు దాటాయి.

అటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గడిచిన 24 గంటల్లో కరోనాతో 19 మంది మరణించారు. నగరంలో కరోనా కేసుల సంఖ్య 6086కు చేరింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటింది. లాక్‌డౌన్ మరో 6 రోజుల్లో ముగుస్తుందనగా.. కోవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here